Rajamouli Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు ‘రాజమౌళి’…ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాయి. బాహుబలి సినిమాతో బెంచ్ మార్కు క్రియేట్ చేసిన ఆయన దానిని అందుకోడానికి చాలామంది దర్శకులు నానా తంటాలు పడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రేక్షకుడికి సైతం 200 రూపాయల్లో విజువల్ వండర్స్ ను చూపించిన రాజమౌళి ఇప్పుడు మరోసారి పాన్ వరల్డ్ సినిమాతో అంతకు మించిన విజువల్ వండర్స్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదే క్రమంలో రాజమౌళి వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న సినిమాలను ఎవ్వరు పట్టించుకోవడం లేదు అలాగే థియేటర్లకి రావడం కూడా మానేశారు అంటూ గతంలో కొన్ని కామెంట్లు వ్యక్తం అయ్యాయి. కానీ ఇప్పుడు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా వచ్చిన తర్వాత అసలు చిన్న సినిమాలనేవి ఉంటాయా కనుమరుగైపోతాయా? అనే విషయం మీద కూడా చర్చలైతే జరుగుతున్నాయి.
ఎందుకంటే 200 రూపాయల్లో భారీ విజువల్ వండర్ ని చూసిన ప్రేక్షకుడు అదే 200 రూపాయలు పెట్టి ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలను ఎవరు పట్టించుకుంటారు. అసలు చిన్న సినిమాలను చూడడానికి ఇష్టపడతారా? ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక దానికి తోడు ఓటిటి లు సైతం రాజ్యమేలుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు ఓటిటీ లోనే సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు…రాజమౌళి సైతం చిన్న సినిమాలను కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడు. ఇక మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్న రాజమౌళి #GlobeTrotter పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ లో మహేష్ బాబు పోస్టర్ ను రిలీజ్ చేస్తారట.
అలాగే ఈ సినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సినిమా ఏ బ్యాడ్రాప్ లో తెరకెక్కుతోంది? ఈ మూవీ కథాంశం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లబోతోంది అనే విషయాలను కూడా రాజమౌళి ఈ ఈవెంట్లో తెలియజేయడానికి సిద్ధమవుతున్నాడు…