Vadde Naveen: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో వడ్డె నవీన్ ఒకరు…ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో మంచి సినిమాలను చేశాడు. పెళ్లి, మనసిచ్చి చూడు, చాలా బాగుంది లాంటి సినిమాలతో అలరించాడు. ఆయన గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలు చేయడంలో చేయడం లేదు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక వడ్డే నవీన్ గురించి అప్పట్లో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న చంద్ర మహేష్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలైతే చేశాడు. ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ వడ్డె నవీన్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఆయన చాలా కోపిస్టీ అంట కదా ఆయనొక ట్రాన్సులో ఉంటాడట కదా! ఆయన్ని మీరెలా అప్రోచ్ అయ్యారు అని అడగగా చంద్ర మహేష్ కూడా దానికి సమాధానం చెబుతూ నేను ప్రేయసిరావే సినిమా చేసి సక్సెస్ అయిన తర్వాత నా నెక్స్ట్ సినిమా వడ్డే నవీన్ తో చేయాలని ప్రొడ్యూసర్ చెప్పాడు. అప్పుడు నేను కూడా కంగు తిన్నాను ఎందుకంటే ఆయనేది ట్రాన్స్ లో ఉంటాడు, కొంచెం కోపిస్టీ అని విన్నాను…దాంతో మా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో సినిమా ఎందుకు సార్ అని అన్నాను.
కానీ మా ప్రొడ్యూసర్ మాత్రం మీరు ఒకసారి అతన్ని కలిసి కథ చెప్పండి అని చెప్పడంతో ఆయన దగ్గరికి వెళ్లి కథ వినిపించాను. కానీ ఆయన మాత్రం నన్ను చాలా సున్నితంగా రిసీవ్ చేసుకున్నాడు. చాలా బాగా మాట్లాడాడు. నేను చెప్పిన కథకు సంబంధించిన విషయాల్లో ఆయనకున్న డౌట్లు అడిగి తెలుసుకున్నాడని చంద్ర మహేష్ చెప్పాడు.
నిజంగా వడ్డే నవీన్ చాలా మంచి మనిషి, కాకపోతే కొంతమంది కావాలనే అతని మీద అలాంటి ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇండస్ట్రీలో సర్కులేట్ చేశారని ఆయన చెప్పాడు… ఇక ఆయనతో నేను చేసిన ‘చెప్పాలని ఉంది ‘ సినిమాకి అప్పట్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది చెప్పాడు. ఆయన స్టార్ హీరోగా ఎదగాల్సింది. కానీ ఎందుకు ఎదగలేకపోయాడు అంటే ఆయన కథ సెలెక్షన్ లో కొంత వరకు లోపం జరిగిందని అందువల్లే ఆయన ఆరోజు టాప్ హీరోగా ఎదగలేకపోయాడని చంద్ర మహేష్ చెప్పాడు.
మొత్తానికైతే వడ్డె నవీన్ కి చాలామంది అభిమానులు ఉన్నారని ఆయన కంబ్యాక్ ఇస్తే మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అని చెప్పడం విశేషం… మొత్తానికైతే వడ్డే నవీన్ ప్రస్తుతం ఒక సినిమాతో కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాబోయే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…