Bigg Boss 9 Telugu : ఎన్నికల్లో మాత్రమే కాదు, బిగ్ బాస్ రియాలిటీ షో ఓటింగ్ లో కూడా దొంగ ఓట్లు ఉంటాయని రీసెంట్ గానే తెలిసింది. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లో టైటిల్ విన్నింగ్ రేస్ లో తనూజ, పవన్ కళ్యాణ్ లు ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ కి వీళ్లకు పడే ఓటింగ్ లో పావు శాతం కూడా పడట్లేదు. సోషల్ మీడియా పోల్స్ లో ఎక్కడ చూసిన వీళ్లిద్దరి లీడింగ్ లో ఉన్నారు. అయితే గూగుల్ లోని కొన్ని పోల్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన పీఆర్ టీమ్స్ చేస్తున్న చీప్ ట్రిక్స్ ని చూసి అసలు ఎవరు టాప్ లో ఉన్నారు అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు ఆడియన్స్. ముఖ్యంగా టాప్ 2 స్థానం లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద పీఆర్ టీం ఉంది.
ఈమధ్య కాలం లో జనాల మైండ్ సెట్ ని మార్చే విధంగా తనూజ కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నట్టు ఫేక్ ఓటింగ్ తో కొన్ని సైట్స్ లోని పొలింగ్స్ ని మ్యానిప్యులేట్ చేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు, నిఖిల్ నాయర్, డిమోన్ పవన్ లకు కూడా ఫేక్ ఓటింగ్ ఒక రేంజ్ లో పడుతోందని నిన్న ఒక పాపులర్ సైట్ లో పోలింగ్ చూసిన తర్వాత అర్థమైంది. వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగిన టాస్కులలో వీళ్లిద్దరు గెలిచారు. గెలిచిన వెంటనే నిఖిల్ ఓట్లు ఒక్కసారిగా ఆ సైట్ లో టాప్ 3 స్థానానికి చేరుకుంది. కాసేపటి తర్వాత డిమోన్ పవన్ నిఖిల్ ని క్రాస్ చేసి తనూజ, పవన్ కళ్యాణ్ లతో సమానమైన ఓటింగ్ ని తెచ్చుకున్నాడు. ఇది గమనించిన సైట్ నిర్వాహకులు, ఫేక్ ఓటింగ్ బాగా జరుగుతోంది అనే విషయాన్నీ గ్రహించి, అప్పటి వరకు నిర్వహించిన ఓటింగ్ ని రద్దు చేసి కొత్తగా పెట్టారు.
ఈ ఓటింగ్ ని పరిశీలిస్తే డిమోన్ పవన్ కి, నిఖిల్ నాయర్ కి ఆశించిన స్థాయిలో ఓటింగ్ పడడం లేదు. నిజమైన ఓటింగ్ ని ఒకసారి పరిశీలిస్తే ఎప్పటి లాగానే తనూజ భారీ లీడింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతోంది. ఇక ఆ తర్వాత స్థానం లో పవన్ కళ్యాణ్ లో ఉన్నాడు. ఇక మూడవ స్థానం లో సుమన్ శెట్టి మరియు భరణి ఉన్నారు. వీళ్లిద్దరికీ సరిసమానమైన ఓటింగ్ పడుతోంది. ఆ తర్వాత డిమోన్ పవన్ కొనసాగుతుండగా, 5 వ స్థానం లో సంజన గల్రాని, 6 వ స్థానం లో రీతూ చౌదరి, 7 వ స్థానం లో గౌరవ్, 8 వ స్థానం దివ్య నిఖిత మరియు 9వ జీతనం లో నిఖిల్ కొనసాగుతూన్నాడు. నిఖిల్ నిన్నటి టాస్క్ లో గెలిచి కింగ్ అయ్యాడు కాబట్టి, ఆయనకు ఇమ్యూనిటీ లభించే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే దివ్య, గౌరవ్ డేంజర్ జోన్ లోకి వస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.