
తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో 23.65 సె. మీ వర్షం కురిసింది. శ్రీరాంసాగర్ జలాశయానికి (ఎస్సార్ఎస్సీ) భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,88,325 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 81,696 టీఎంసీలుగా ఉంది. ఎస్సార్ఎస్సీ 8 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు.