సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ‘జయలలిత’ జీవిత చరిత్ర ఆధారంగా తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తీసిన బయోపిక్ ‘తలైవి’. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని స్టిల్స్ ను వదిలారు. కంగనా, అరవింద్ స్వామి కలయికలో వచ్చిన ఈ స్టిల్స్ లో వీరిద్దరూ గెటప్ అండ్ వీరి ఎక్స్ ప్రెషన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ స్టిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఈ బయోపిక్ బడ్జెట్ 150 కోట్లు అట, కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండటం, అలాగే అమ్మ బయోపిక్ కాబట్టి, తమిళంలో కూడా ఈ సినిమాకి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చేశారు. అయితే ఇప్పుడు తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమాకి మార్కెట్ పరంగా బాగా కలిసొచ్చేలా ఉంది.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే.. ఈ సినిమా పెట్టిన నూట ఏభై కోట్లు ఈజీగానే రికవరీ అవుతాయని చిత్రబృందం నమ్ముతుంది. కానీ అమ్మ జయలలిత పై ఇప్పటికే పలు బయోపిక్స్ వచ్చాయి. వాటిలో ఏది వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ బయోపిక్ ఎలా వర్కౌట్ అవుతుంది ? అనేది సగటు ప్రేక్షకుడు ఆలోచన. కానీ ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ స్టార్ మేకప్ మెన్ ‘గ్యారీ ఓల్డ్ మెన్ ఈ సినిమాకి పని చేశారు.
పైగా జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా కంగనా రనౌత్ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసిందట. ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో హల్ చల్ చేసే కంగనా రనౌత్, మరి జయలలిత పాత్రలో ఎలా జీవించిందో చూడాలి. ఇక బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Will thalaivi market to be workout
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com