Srikakulam: శ్రీకాకుళం జిల్లా కంచిలీ మండలం తలతంపర పంచాయతీలో తీవ్ర విషాదం నెలకొంది. చిల్లి పుట్టగలో గ్రామదేవత ఉత్సవాల్లో అలంకరణ చేస్తుండగా, వైర్లు తెగి విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు మృతి చెందారు. తొలుత బాలుడు కాళిదాస్ విద్యుత్ షాక్ కు గురికాగా, అతడిని కాపాడేందుకు నందిని, ఇద్దరిని కాపాడే ప్రతయ్నంలో ఈశ్వరరావు మరణించారు. దీంతో జాతరతో ఉత్సాహంగా ఉండాల్సిన ఊరు విషాదంలో మునిగింది.