
డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో 2,193 మంది అర్హులకు ఎస్జీటీ పోస్టింగులివ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీరికోసం ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో పని చేసేందుకు అభ్యర్థులు రాత పూర్వకంగా అంగీకారం తెలిపారన్నారు. కేవలం డీఎస్సీ 2008 అభ్యర్థులకు మాత్రమే వర్తించేలా పోస్టింగులివ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.