
సౌతాఫ్రికాకు చెందిన గోసియామ్ తమరా సిథోల్ అనే మహిళ గర్భం దాల్చింది. అయితే, ఆరో నెలలో పరీక్షించిన వైద్యులు కనీసం ఎనిమిది మందికి జన్మనిచ్చి ఆక్టోమామ్ అవుతారని అనుకున్నారు. అయితే సోమవారం ఆమె ప్రిటోరియా దవాఖానలో 10 మంది శిశువులకు జన్మనిచ్చింది. సిజేరియన్ నిర్వహించి 10 మందిని క్షేమంగా బయటకు తీశారు. వీరిలో ఏడుగురు బాలురు ఉండగా ముగ్గురు బాలికలు ఉన్నారు. వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని అయితే వారిని మరికొన్ని రోజులపాటు ఇదే దవాఖానలోని ఇంక్యూబేటర్లలో ఉంచి సంరక్షించనున్నట్లు దవాఖాన యాజమాన్యం తెలిపింది.