
జగన్ ప్రభుత్వం తెచ్చిన నూతన పన్ను విధానాన్ని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఉచితాలు ఇచ్చుడు.. పన్నులు పెంచుడు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్తిపన్నుల పెంపు, చెత్తపై పన్నుల విధింపును బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు.