
కరోనా రక్కసి కాటుకు యావత్ దేశం చిగురుటాకులా విలవిల్లాడుతోంది. లక్షల మందిపై మహమ్మారి విరుచుకుపడుతూనే ఉంది. వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. 24 గంటల వ్యవధిలో 3.66 లక్షల మంది కొవిడ్ బారిన పడ్డారు. అంతక్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 35 వేలకు పైగా తగ్గాయి. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం కేవలం 14.7 లక్షల మందికే వైరస్ పరీక్షలు చేశారు. అంతక్రితం రోజున 18.6 లక్షల మంది టెస్టులు చేయించుకున్నారు. అలాగే 3754 మంది కరోనాతో మరణించారు.