
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 54,455 నమూనాలను పరీక్షించగా 1,413 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,83,721కి చేరింది. తాజాగా 18 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 13,549కి పెరిగింది. మరోవైపు 1,795 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,549 క్రియాశీల కేసులు ఉన్నాయి.