
తెలంగాణ కాంగ్రెస్ సారథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో గుడిహత్నూర్ నుంచి ఇంద్రవెల్లి మార్గంలో ట్రాపిక్ నిలిచిపోయింది. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేస్తున్నారు. సభాస్థలికి దూరంగా వాహనాలు పార్కింగ్ చేయిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కాలినడకన సభకు వెళ్తున్నారు. సభాస్థలిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.