
దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గత 24 గంట్లలో 18,17,639 కరోనా టెస్టులు చేస్తే 43,263 మందికి పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో 338 మంది చనిపోయారు. మొత్తం కేసులు 3,31,39,981 కు చేరగా 4,41,749 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 3,93,614 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఒక్క కేరళలోనే 30,196 కేసలు, 181 మరణాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 71.65 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.