Sircilla: సిరిసిల్ల జిల్లాలో తివ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. సీఎం రేవత్ రెడ్డి ఫొటోను కార్యాలయంలో పెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరిగాయి. కొందరికి గాయాలు కూడా అయ్యాయి.