
ఒలింపిక్స్ లో స్వర్ణం ఆశలు చేజారిన వేళ కాంస్య పతకం కోసం జరుగుతున్న పోరులో సింధు చెలరేగుతోంది. మూడో స్థానం కోసం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హే బింగ్ జియావో తో తలపడుతోంది. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో తొలి సెట్ లో సింధు 21-13 తో విజయం సాధించింది. రెండో సెట్ లోనూ విజయం సాధిస్తే సింధుకు పతకం ఖాయమైనట్లే.