పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ

పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ మధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ కొనసాగుతారని, అయితే పీసీసీ అధ్యక్షుడిగా నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ బాధ్యతలు చేపడతారని పంజాబ్ వ్యవహారాల ఇన్ చార్జీ హరీశ్ రావత్ ప్రకటించారు. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ నిర్ణయాన్ని […]

Written By: Suresh, Updated On : July 15, 2021 1:16 pm
Follow us on

పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ మధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ కొనసాగుతారని, అయితే పీసీసీ అధ్యక్షుడిగా నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ బాధ్యతలు చేపడతారని పంజాబ్ వ్యవహారాల ఇన్ చార్జీ హరీశ్ రావత్ ప్రకటించారు. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.