Car drags police officer: పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారు. నేరాలు చేసే వాళ్లకు చుక్కలు చూపిస్తారు. అసాంఘిక శక్తులకు నరకం అంటే ఏమిటో తెలియజేస్తారు. అందువల్లే పోలీసులు అంటే అందరూ భయపడుతుంటారు.
మద్యం తాగే వారిని మొదలుపెడితే నేరం చేసే వాళ్ళ వరకు అందరి విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. పైగా, అలాంటి వారికి శిక్షలు పడేలా చేయడంలో ముందడుగు వేస్తుంటారు. పగడ్బందీ ఆధారాలతో చట్టముందు దోషులుగా నిలబెడుతుంటారు.
శాంతిభద్రతలను పర్యవేక్షించే క్రమంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. కొన్ని సందర్భాలలో కుటుంబాలకు కూడా దూరంగా ఉంటారు. అంతటి త్యాగం చేస్తున్న పోలీసుల విషయంలో సమాజం గౌరవంతో ఉండాలి. కానీ, పోలీసుల మీద గౌరవం లేని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో వికృత చేష్టలకు ఒడి కట్టాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకుంది.
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి కారులో వేగంగా వచ్చాడు. అంతే వేగంతో పోలీసులను ఢీకొట్టాడు. ఎస్ఐ చెబుతున్నప్పటికీ కారు వేగాన్ని నియంత్రించలేదు. కారు బానెట్ మీద ఎస్ఐ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి తన కారు వేగాన్ని తగ్గించలేదు. దీంతో ఎస్ఐ ప్రాణాలకు తెగించి కారు మీద నుంచి దూకారు. తద్వారా తన ప్రాణాలను కాపాడుకున్నారు…
యాచారం ఎస్ఐ మధు పట్టణంలో తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి విపరీతమైన వేగంతో కారును తోలుతూ ఎస్ఐ ని ఢీకొట్టారు. అంతే కాదు కారును ఏ మాత్రం ఆపకుండా ముందుకు పోనిచ్చారు. కాస్త వేగాన్ని తగ్గించడంతో ఎస్ఐ కారు మీద నుంచి దూకారు. ఇదే సమయంలో ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి యాచారంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వాహనం మీద ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేయి విరిగింది. ఆమె చిన్నారికి గాయాలయ్యాయి. అయితే ఆ కార్ డ్రైవర్ ను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు తోలుతున్న వ్యక్తిని కోహెడ ప్రాంతానికి చెందిన శ్రీకర్ గా గుర్తించారు. అతడిని పరీక్షించగా మద్యం తాగినట్టు గుర్తించారు. ఆ కారులో శ్రీకర్ తో పాటు నితిన్ అనే వ్యక్తి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
A drunk driver trying to escape police checks dragged an SI on the car bonnet for 500 meters in Yacharam. The vehicle hit a biker, injuring him.
SI Madhu survived by jumping off. The driver was caught near Ibrahimpatnam; alcohol confirmed.
⚠️ Drunk driving is a serious crime.… pic.twitter.com/2J0KwDP6nP
— Keshaboina Sridhar | Voice of the People (@keshaboinasri) January 26, 2026