Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer captaincy : జట్టులో నుంచి తొలగించారు.. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.. శ్రేయస్...

Shreyas Iyer captaincy : జట్టులో నుంచి తొలగించారు.. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.. శ్రేయస్ అయ్యర్ ఇంతటి బాధను మోశాడా

Shreyas Iyer captaincy : సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టి, హార్ధిక్ పాండ్యాను లెక్కలోకి తీసుకోకుండా, గిల్ ను పరిగణలోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ టీమిండియా టీ20 ఫార్మాట్ లోకి సారథిగా శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లకు అతడే సారథిగా ఉంటాడని ప్రకటించింది. మేనేజ్మెంట్ నిర్ణయం సూర్యకుమార్ యాదవ్,అతడి అభిమానులకు ఇబ్బంది కలిగించింది. శ్రేయస్ అయ్యర్ అభిమానులకు, పంజాబ్ జట్టు అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.

అయ్యర్ కొంతకాలంగా స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. గతంలో ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కోల్ కతా జట్టును 2024లో విజేతగా చేశాడు. 2025 లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఈసారి సీజన్ లో పంజాబ్ జట్టును మొదట్లో పాయింట్లపట్టికలో మొదటి స్థానంలో కొనసాగేలా చేశాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టు వరుస ఓటములు ఎదుర్కొని గ్రూప్ దశ నుంచే వెళ్లిపోయింది. పంజాబ్ జట్టు ఫైనల్ దాకా వెళ్లలేకపోయినప్పటికీ అయ్యర్ కు మాత్రం ఇండియా జట్టుకు సారథి అయ్యే లక్ మాత్రం దక్కింది.

అయ్యర్ కెప్టెన్ అయిన తర్వాత అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతడు గతంలో టీమండియాలో సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయాడు. ఆ సమయంలో అతడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకదశలో అతడికి సరైన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో అతడు నిరాశ పడలేదు. పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలి అనుకున్నాడు. జాతీయ టోర్నీలలో అదరగొట్టాడు. ఆటగాడిగా, సారథిగా సత్తా చూపించాడు. ఐపీఎల్ కూడా దుమ్ము రేపాడు. దీంతో మేనేజ్మెంట్ అతడికి అవకాశం కల్పించింది.

కెప్టెన్ అయిన తర్వాత అయ్యర్ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యు లో పాల్గొన్నాడు. ఈసందర్భంగా తన క్రీడా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల పై మాట్లాడాడు. ‘భారత జట్టుకు నాయకత్వ బాధ్యతను అప్పగించినందుకు సంతోషంగా ఉన్నాను. కానీ, ఈస్థాయికి చేరుకోవడానికి చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. కఠోర శ్రమ కు పాల్పడాల్సి వచ్చింది. రెండు ఏళ్ల క్రితం సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. నాడు నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను. మొత్తానికి నిరూపించుకున్నాను. నేను కెప్టెన్ అయిన తర్వాత మొదటి సారి వీడియోకాల్ చేశాను. నా తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. నేను కూడా భావోద్వేగానికి గురయ్యాను.ఇప్పుడు నా ముందు పెద్ద బాధ్యత ఉంది. భారత్ ను ముందువరసలో నిలపడమే నా బాధ్యత అని’ అయ్యర్ వ్యాఖ్యానించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version