Shravan Sai Case : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నుంచి కాకాని శ్రవణ్ సాయి (19) ఘటన తీవ్రస్థాయిలో సంచలనం కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శ్రావణ్ సాయి హైదరాబాదులోని మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్నాడు.
శ్రావణ్ సాయి మంగళవారం తన ప్రియురాలు ఇంటికి వెళ్లిన కొద్ది గంటలకే హైదరాబాదు నగరంలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు తెలుస్తోంది. అతడి ప్రియురాలి కుటుంబ సభ్యులు కొట్టి చంపారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రవణ్ ను నిర్బంధించారని.. అతనిపై దారుణంగా దాడి చేశారని.. అందువల్లే అతడు చనిపోయాడని శ్రావణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆ యువతితో ఉన్న అనుబంధం రెండు కుటుంబాలకు తెలుసని.. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు వ్యతిరేకించాలని పోలీసులు అంటున్నారు.
శ్రవణ్ కుత్బుల్లాపూర్ లోని ఓ భవనంలో అద్దెకు ఉంటున్నాడు. శ్రవణ్ పదో తరగతి కూకట్పల్లిలోని ప్రగతి నగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శ్రావణ్ చదువుకున్నాడు. అతడు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఆ బాలిక కూడా అక్కడే చదువుకునేది. ఆ బాలిక అమీన్పూర్ పట్టణంలోని బీరంగూడ సృజన లక్ష్మీ నగర్ లో నివాసం ఉండేది. పదవ తరగతి చదువుతున్నప్పుడే వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. అది కాస్త ప్రేమగా మారింది. వాస్తవానికి వారిద్దరూ బీటెక్ వేరువేరు కాలేజీల్లో చదువుతున్నప్పటికీ.. తరచుగా కలుసుకునేవారని తెలుస్తోంది.
ఇరు కుటుంబాల వారికి వారిద్దరి మధ్య అనుబంధం తెలుసు కాబట్టి.. శ్రవణ్ ను అమ్మాయి తరఫున బంధువులు హెచ్చరించారు. ఇద్దరు దూరం పాటించాలని సూచించారు. అయితే మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రావణ్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. అక్కడ గొడవ జరిగింది. గొడవ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి చేయి విరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించాలని తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ యువతి చికిత్స పొందుతోంది.