
సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ సేవలకు గురువారం ఉదయం కొద్దిసేపు ఆటంకం కలిగింది. దాంతో ట్విటర్ డౌన్ అంటూ వినియోగదారుల వ్యక్తిగత ఖాతాల్లో సందేశాలు వెల్లువెత్తాయి. ట్విటర్ వేదికగా సందేశాలు పంపించేందుకు చూసేందుకు అంతరాయం కలిగినట్లు నెటిజన్లు వెల్లడించారు. కొందురు తమ టైమ్ లైన్ ను వీక్షించడం సాధ్యంకాలేదని చెప్పాగా మరికొందరు తమ పర్సనల్ కంపూటర్లలో ట్విటర్ ను యాక్సెస్ చేయడం వీలుకాలేదన్నారు. మొబైల్ ఫోన్లలో ఈ సమస్య ఎదురుకానట్లు తెలుస్తోంది.