KTR ACB Notices: కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై విచారణలో భాగంగా సోమవారం విచారనకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుతో ఫార్ములా ఈ రేస్ చుట్టూ అలుముకున్న వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాజకీయ వర్గాల్లో తీవకర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి ఆరోపణలపై లోతైన దర్యాప్తునకు ఆదేశించింది.