
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేశారు. వయాన్ ఇండస్ట్రీస్ లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత శిల్పా శెట్టికి సమన్లు పంపుతారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ కు శిల్పా శెట్టి రాజీనామా చేసినట్లు సమాచారం వెలువడుతున్నది. రాజ్ కుంద్రాకు చెందిన చాలా వ్యాపారాల్లో శిల్పా భాగస్వామిగా ఉన్నారు.