Nari Nari Naduma Murari : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోలందరు సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన పోటీ పడుతున్నారు. శర్వానంద్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేశాడు. ఇక కొన్ని సంవత్సరాల నుంచి అతనికి సరైన సక్సెస్ అయితే రావడం లేదు. నారీ నారీ నడుమ మురారి సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని చాలామంది మీడియం రేంజ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు… తను ప్రస్తుతం భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడంతో గోపీచంద్, నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోలకు గట్టి పోటీని ఇచ్చే హీరోగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తనకి భారీ సక్సెస్ రావడం అనేది ఒకెత్తయితే మిగతా హీరోలు సైతం అతని చూసి నేర్చుకోవాలంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి సూపర్ సక్స్ లను సాధిస్తే బాగుంటుంది అంతే తప్ప ఏవో ఒక సినిమాలను చేసి ప్రేక్షకుల మీద రుద్దుతం అంటే ప్రేక్షకుడు సక్సెస్ చేసే అవకాశాలైతే లేవు…
ఇక ప్రస్తుతం శర్వానంద్ ను చూసి చాలామంది హీరోలు సైతం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల విషయంలో ఏ ఒక్కరు చిన్న నిర్లక్ష్యం వహించినా కూడా సినిమాలు డిజాస్టర్లుగా మారుతున్నాయి.
తద్వారా వాళ్లకు అనుకున్న గుర్తింపైతే రావడం లేదు. అందువల్లే మంచి కాన్సెప్టులతో సినిమాలు చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఈ సంవత్సరం స్టార్ హీరోలు సైతం వాళ్ళ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
గత సంవత్సరంలో ఎక్కువ మంది స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయలేకపోయారు. కానీ ఈ సంవత్సరం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసే అవకాశమైతే ఉంది…అలాగే యంగ్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు సైతం ఎక్కువ సంఖ్యలో సినిమ్లు రిలీజ్ చేసి వాళ్ళ సినిమాలతో సక్సెస్ లను సాధిస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది…
