Shambala Movie Box Office Collection : ఈ క్రిస్మస్ కానుకగా విడుదలైన నాలుగు చిన్న చిత్రాల్లో ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘శంబాలా'(Samabala Movie). ఆది సాయి కుమార్(Aadi Sai Kumar) హీరో గా నటించిన ఈ సినిమా పై విడుదలకు ముందు నుండే ఆడియన్స్ లో ఆసక్తి ఉండేది. ఎందుకంటే టీజర్ తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ట్రైలర్ తో అయితే ఆడియన్స్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ రేంజ్ క్వాలిటీ ఎలా తీశారో అంటూ ఆశ్చర్యపోయారు. సినిమా విడుదల తర్వాత కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఫలితంగా క్రిస్మస్ విజేతగా ఈ చిత్రం నిల్చింది. నేటితో పూర్తి స్థాయి లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిన ఈ చిత్రం, రేపటి నుండి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది అందరిలో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.
బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి నాల్గవ రోజున 27 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అదే విధంగా ఓవర్సీస్ లో నాల్గవ రోజున ఈ చిత్రానికి 28 వేల డాలర్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా నాల్గవ రోజున రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కోటి రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాధించినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దీంతో ఓవరాల్ గా ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 4 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల రేంజ్ లో జరిగింది. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో పది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
కాబట్టి నేటితో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి, రేపటి నుండి లాభాల్లోకి అడుగుపెట్టబోతుందని అంటున్నారు బయ్యర్స్. మొత్తం మీద హీరో గా నిలదొక్కుకోవడానికి ఆది సాయి కుమార్ ఎన్నో ఏళ్ళ నుండి కష్టపడుతూనే ఉన్నాడు. నేటి తరం ఆడియన్స్ కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్నారని , అదే తరహా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ అదృష్టం కలిసి రాక, సక్సెస్ మాత్రం ఇన్ని రోజులు రాలేదు. కానీ ఇప్పుడు ‘శంబాలా’ చిత్రం భారీ విజయం సాధించడం ఆది కి మంచి బూస్ట్ ని ఇచ్చింది అనే చెప్పాలి. ఈ సక్సెస్ తో రెట్టింపు జోష్ ని నింపుకొని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సబ్జక్ట్స్ ని ఎంచుకోవాలని అంటున్నారు విశ్లేషకులు.