
మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. భివాండీ సమీపంలోని గోదాముల్లో పోలీసులు ఈ ఉదయం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను గుర్తించారు. 12 వేల జిలెటిన్ స్టిక్స్, 3 వేల డిటోనేటర్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ నుంచి ఎవరు తీసుకొచ్చి గోదాముల్లో దాచారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.