
కరోనా కారణంగా తెరుచుకొని పాఠశాలలను నవంబర్ 2నుండి తెరవనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించాడు. అక్టోబర్ 5నుండి తెరుచుకుంటాయని మొదట ప్రకటించిన కరోన పరిస్థితులపై అధికారులతో సమీక్ష జరిపి మరోమారు వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే అక్టోబర్ 5నుండి పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్య కిట్లను అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.