
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సన్నద్ధతపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్య, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. పాఠశాలల పున ప్రారంభానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, విద్యార్థుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని మంత్రి సబిత ఆదేశించారు.