https://oktelugu.com/

Tamannaah ‘Andhadhun’ : తమన్నా హొయలు, టబు రేంజ్ లో లేవు అట !

Tamannaah ‘Andhadhun’: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఎక్కువ రెమ్యునరేషన్ కోసం, నితిన్ ‘మాస్ట్రో’ (Maestro) సినిమాలో ఓ బోల్డ్ పాత్రలో నటించింది. హిందీలో మంచి విజయం సాధించిన ‘అంధధూన్’(Andhadhun) సినిమాకి ఈ సినిమా రీమేక్. అయితే, ఈ సినిమా హిందీ వెర్షన్ లో కీలకమైన పాత్ర మరియు విలన్ పాత్రలో టబు నటించింది. టబు చేసిన పాత్రను తెలుగులో తమన్నా చేస్తోంది. నిజానికి సినిమా మొత్తం తమన్నా పాత్ర చుట్టే తిరుగుతుంది. పైగా తమన్నా కూడా […]

Written By:
  • admin
  • , Updated On : August 24, 2021 / 12:56 PM IST
    Follow us on

    Tamannaah ‘Andhadhun’: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఎక్కువ రెమ్యునరేషన్ కోసం, నితిన్ ‘మాస్ట్రో’ (Maestro) సినిమాలో ఓ బోల్డ్ పాత్రలో నటించింది. హిందీలో మంచి విజయం సాధించిన ‘అంధధూన్’(Andhadhun) సినిమాకి ఈ సినిమా రీమేక్. అయితే, ఈ సినిమా హిందీ వెర్షన్ లో కీలకమైన పాత్ర మరియు విలన్ పాత్రలో టబు నటించింది. టబు చేసిన పాత్రను తెలుగులో తమన్నా చేస్తోంది.

    నిజానికి సినిమా మొత్తం తమన్నా పాత్ర చుట్టే తిరుగుతుంది. పైగా తమన్నా కూడా గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రను చెయ్యలేదు. అన్నిటికీ మించి టబు అద్భుతంగా చేసింది. ఒకపక్క సెక్సీగా కనిపిస్తూ మరోపక్క అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించింది. తమన్నా కూడా అలాగే చేయాల్సి ఉంది. కానీ సినిమాలో తమన్నా ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిందని తెలుస్తోంది.

    ‘టబు’ స్థాయిలో తమన్నా అసలు నటించలేకపోయిందట. తమన్నా హొయలు, టబు రేంజ్ లో లేవు అని, ఇక విలనిజం కూడా ఏ మాత్రం ఎఫెక్టివ్ గా లేదు అని తెలుస్తోంది. మొత్తానికి తమన్నాకి ఇది పెద్ద ఛాలెంజే. “మాస్ట్రో” హాట్ స్టార్ లో వచ్చే నెల 9న రిలీజ్ అవుతుంది. సినిమాని ఎన్ని సార్లు అయినా చూసే అవకాశం ఉంది కాబట్టి, రిపీట్ డ్ ఆడియన్స్ ఉంటారు.

    కాబట్టి, గొప్పగా నటిస్తేనే తమన్నా సేఫ్, కానీ తమన్నా నటన మరీ పేలవంగా ఉందని తెలుస్తోంది. అయినా ఒక సినిమాని రీమేక్ చేస్తూ.. ఒరిజినల్ నటీనటుల చేసినట్టే.. మిగితా వాళ్లూ కూడా నటించడం అంత సులువు కాదు. పైగా ఒరిజినల్ వెర్షన్ లో జరిగిన మేజిక్ ప్రతిసారి జరగడం చాలా కష్టం.

    ప్రస్తుతానికి అయితే అసలుకే మిల్కీ బ్యూటీకి పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో నటన బాగాలేదు లాంటి విమర్శలు ఎక్కువ అయితే కెరీర్ కే నష్టం. తమన్నా చేతిలో ఇంకా ఎఫ్‌ 3 మరియు సిటీ మార్ లాంటి సినిమాలు ఉన్నాయి.