CISF Officer Stops Salman: మన దేశంలో సినీ స్టార్లు బయటకొస్తే వారి మీద జనం ఎగబడిపోతారు. వారితో సెల్ఫీలు దిగడానికి పోటీపడుతారు. అధికారులు సైతం సినీ స్టార్లను చూడగానే ఆపుకోలేక వారితో ఫొటోలు దిగుతారు. వారికి రాచమర్యాదలు చేస్తారు. దేశంలోనే అగ్రహీరో అయిన సల్మాన్ ఖాన్ బయట కనపడితే చాలు ఆయనను నెత్తిన పెట్టుకునే వారు ఎందరో.. ఏ ఆఫీస్ కెళ్లినా మంచి ఆదరణ ఉంటుంది. కానీ ముంబై విమానాశ్రయంలో మాత్రం తాజాగా సల్మాన్ ఖాన్ కు షాక్ తగిలింది. ఓ యువ సీఐఎస్ఎఫ్ ఆఫీసర్ సల్మాన్ ను రూల్స్ పాటించాల్సిందిగా చెబుతూ గట్టి షాకిచ్చారు. ఇప్పుడీ వీడియో వైలర్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ‘టైగర్3’ మూవీ సినిమా షూటింగ్ కోసం ముంబై విమానాశ్రయం నుంచి రష్యా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విమానాశ్రయానికి వచ్చి మాస్క్ తీసేసి దర్జాగా లోపలికి వెళుతుండగా సల్మాన్ ను అడ్డుకొని సెక్యూరిటీ చెక్ చేసుకోవాలని యువ అధికారి సూచించడం సంచలనమైంది. సల్మాన్ మాస్క్ తీసేసి నేను అని చూపించినా కూడా ఆ అధికారి చెకింగ్ కంపల్సరీ అని పంపించడం హాట్ టాపిక్ గా మారింది.
‘టైగర్3’ సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లేందుకు సల్మాన్ ఖాన్ ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించడానికి ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ చెక్ చేయించుకోవాల్సి ఉండగా.. సల్మాన్ మాత్రం అదేమీ చేసుకోకుండా విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ గేట్ వద్దే ఉన్న సెక్యూరిటీ యువ అధికారి సల్మాన్ ను అడ్డుకున్నాడు. కామేన్ మ్యాన్ లాగా తొలుత సెక్యూరిటీ చెక్ చేసుకోవాలని అటువైపు పంపించాడు.
దీంతో సల్మాన్ ఫొటోలు, వీడియోలు తీస్తున్న ఫొటోగ్రాఫర్లు షాక్ అయ్యారు. వారు దీన్ని తీస్తుండగా ఆ యువ అధికారి వారిని కూడా బటయకు పోవాలంటూ సూచించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సల్మాన్ ఖాన్ నే అడ్డుకున్న యువ అధికారి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
Viral Video: Salman Khan Stopped at Mumbai Airport enroute Russia by a Young CISF Officer; Asked to Stand in line and Complete Security Check like a Common Man pic.twitter.com/uEeuRjp5yA
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 20, 2021