Homeజాతీయం - అంతర్జాతీయంఎస్బీఐ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా

ఎస్బీఐ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా

ఈ నెల 23న జరగాల్సిన ఫార్మసిస్టు, డేటా అనలిస్టు ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాయిదా వేసింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు బుధవారం తెలిపింది. పరీక్షలు నిర్వహించబోయే కొత్త తేదీలను బ్యాంకు ఇంకా ప్రకటించలేదు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇప్పటికే విడుదల చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. మరోవైపు ఇదే బ్యాంకులో జూనియర్ అసోసియేట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular