
గుంటూరు జిల్లాలో నాటుసారా మాఫియా బరితెగించింది. ఏకంగా పాఠశాల ప్రాంగణలోనే నాటుసారా తయారు చేస్తుండగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నిజాంపట్నం మండలం హారీస్ పేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కరోనా లాక్ డౌన్ కరణంగా గత కొంతకాలంగా పాఠశాలకు సెలవు కావడంతో తెరవడంలేదు. ఇదే అదునుగా భావించిన నాటు సారా తయారీదారులు దర్జాగా పాఠశాల ఆవరణలోనే సారా తయారీ బట్టీ పెట్టారు. పాఠశాల గదికి బయట తాళం వేసి లోపల గ్యాస్ స్టవ్ లతో నాటు సారా తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఈబీ సీఐ శ్రీనివాసరావు తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురిని అరెస్టు చేసి నాటు సారాతో పాటు, దాని తయారీకి ఉపయోగించే ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు.