Sanju Samson poor form : టి20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ సృష్టించిన సంచలనం మామూలుది కాదు. ఏకంగా వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మెన్ అఫ్ ది సిరీస్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. భీకరమైన ఫామ్ లో ఉన్న సంజు.. ఐపీఎల్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.
ఐపీఎల్ మెగా వేలంలో సంజును చెన్నై జట్టు రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసింది. అతడి స్థానంలో అద్భుతమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్ జట్టుకు ఇచ్చేసింది. తన మీద అంత నమ్మకం పెట్టుకున్న చెన్నై జట్టు యాజమాన్యానికి సరైన గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాడు సంజు. ఓపెనర్ గా వస్తున్న అతడు తన స్థాయి ఇన్నింగ్స్ ఆడ లేకపోతున్నాడు. రాజస్థాన్, పంజాబ్, తాజాగా బెంగళూరు జట్ల పై విఫలమయ్యాడు. ఓపెనర్ గా జట్టు భారాన్ని మోయాల్సిన అతడు.. నిర్లక్ష్యమైన షాట్ లు ఆడి మూల్యం చెల్లించుకుంటున్నాడు.. ఫలితంగా చెన్నై జట్టు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నది.
గతంలో కూడా సంజు ఇలానే ఆడేవాడు. తర్వాత తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. చెత్త బంతులను మాత్రమే ఆడిన అతడు.. పదునైన బంతులను వదిలేశాడు. అందువల్లే టి20 వరల్డ్ కప్ లో అతడు సక్సెస్ అయ్యాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇటువంటి సంజు ఇప్పుడు ఇలా ఆడుతుండడం అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో 251 రన్స్ టార్గెట్ ను చేజ్ చేసే విషయంలో సంజు సరిగా అడక పోవడం చెన్నై జట్టు అభిమానులను తీవ్రమైన దిగ్బ్రాంతికి గురిచేస్తుంది. గైక్వాడ్ విఫలం కావడం.. అతడి దారిలోనే సంజు వెళ్లిపోవడంతో చెన్నై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఓపెనర్లు ఇప్పటివరకు తమ స్థాయి ఆట తీరు ప్రదర్శించకపోవడం పట్ల మండిపడుతున్నారు. వారిద్దరిని తదుపరి మ్యాచ్లకు దూరంగా పెట్టాలని.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై చెన్నై యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
బ్యాకప్ లెంత్ బంతులను.. షార్ట్ పిచ్ బంతులను సంజు సూపర్ ఆడతాడు. స్లో డెలివరీలను కూడా కఠినంగా శిక్షిస్తాడు. కానీ ఆ బంతులను ప్రస్తుత ఐపిఎల్ లో అతడు ఆడలేక పోతున్నాడు. కనీసం డిపెండ్ కూడా చేయలేకపోతున్నాడు. అలాంటి బంతులు వస్తే ఒక రకమైన భయం అతని కళ్ళల్లో కనిపిస్తోంది. ఆ బంతులను సరిగా ఆడలేక అవుట్ అయి వెళ్తున్నాడు. అతడి దుస్థితి చూసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపాలను సవరించుకోవాలని అతనికి సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.