
సంగం డెయిరీ సర్వర్ లు హ్యాకింగ్ అయినట్లు సంస్థ ఐటీ వింగ్ గుర్తించింది. రోజువారీ కార్యకలాపాల డేలా హ్యాకింగ్ కు గురైందని ఐటీ వింగ్ ఉద్యోగులు పసిగట్టారు. దీనిపై డెయిరీ ఐటీ వింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే పోలీసుల సోదాలు నిలిపివేయాలని సంగం సిబ్బంది డిమాండ్ చేశారు. సంస్థ సర్వర్ రూమ్ వద్దకు ఏసిబీ అధికారులతో పాటు పోలీసులు కూడా చేరుకున్నారు. సర్వర్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో సంస్థ ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్టర్స్ రాక ముందే సర్వర్లను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది.