
సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించే మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ సరికొత్త వెసులుబాటు కల్పించింది. రాత్రి 7.30 గంటల తర్వాత వారు ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ బస్సు ఆగేలా, దిగాలనుకున్న చోట దిగేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి ఇది అమలు కానుందని సంస్థ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సౌకర్యం పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9959226160, 9959226154 నంబర్లను ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మరోవైపు ముఖ్యమైన బస్టాపుల్లో రాత్రి 10 వరకు బస్సుల నియంత్రణ అధికారులుండేలా చర్యలు తీసుకున్నారు.