
క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్ కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్షీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 19 న తీన్నార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేశాడని డబ్బులు ఇవ్వకపోవడంతో 20 వ తేదీన తప్పుడు కథనాలు ప్రచురించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.