
రూ. 3.8 కోట్ల విలువైన హెరాయిన్ ను సీజ్ చేసిన పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబై పోలీసుకు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ సర్వసతి నాయుడు అనే 50 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద 1.02 కేజీల హెరాయిన్ ను స్వాథీనం చేసుకున్నారు. నాయుడు ఎంతోకాలంగా సౌత్ సెంట్రల్ ముంబై డ్రగ్స్ విక్రయాల్లో క్రీయాశీలకంగా ఉన్నట్లు పోలీసు అధికారి దత్తా నలవాడే తెలిపారు.