Homeక్రీడలుRajasthan vs Mumbai IPL : రాజస్థాన్, ముంబై మధ్య మ్యాచ్.. ఇది కూడా అస్సామేనా

Rajasthan vs Mumbai IPL : రాజస్థాన్, ముంబై మధ్య మ్యాచ్.. ఇది కూడా అస్సామేనా

Rajasthan vs Mumbai IPL : ఐపీఎల్ జోరుగా సాగుతున్న క్రమంలో.. నిన్నటి మ్యాచ్ కు వర్షం బ్రేక్ వేసింది. ఉత్కంఠ గా సాగుతుందనుకుంటున్న క్రమంలో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా ప్రేక్షకులు వచ్చారు. మొదట్లో చినుకులు పడ్డాయి. ఆ తర్వాత ఆకాశంలో మేఘాలు దట్టంగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపు మ్యాచ్ కొనసాగింది. అనంతరం విపరీతంగా వర్షం కురిసింది. మైదానం నిర్వాహకులు పరదాలు కప్పి స్టేడియం, ఔట్ ఫీల్డ్ తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు.

ఈ మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు నిర్వాహకులు..చెరొక పాయింట్ కేటాయించారు. ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల పంజాబ్ జట్టుకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ కోల్ కతా కు తీవ్రమైన నష్టం ఏర్పడింది . 2024లో విజేతగా నిలిచిన ఆ జట్టు.. ఈ సీజన్లో ఇప్పటికే వరుస ఓటములు ఎదుర్కొంది. కీలకమైన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఆ జట్టు మీద మరింత ఒత్తిడి ఏర్పడింది.

ఇక మంగళవారం గౌహతివేదికగా ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అస్సాం గుహవాటి ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. మేఘాలు దట్టంగా ఏర్పడ్డాయి. ఈ కథనం రాసే సమయం వరకు కూడా అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే ఆ నగరానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆట నిర్వహించడానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ కూడా రద్దు అయితే.. రెండు జట్లకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. రాజస్థాన్ జట్టుకు తక్కువ నష్టం.. ముంబై జట్టుకు ఎక్కువ నష్టం జరుగుతుంది.

వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కూడా అస్సామేనా అని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న వర్షం వల్ల కోల్ కతా, పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా రద్దు అయితే రెండు జట్లకు చెరొక పాయింట్ మాత్రమే లభిస్తుంది.

అస్సాం రాష్ట్రంలో గడిచిన రెండు రోజులుగా వాతావరణం లో సమూల మార్పులు ఏర్పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమవుతోంది. చినుకులు కూడా పడుతున్నాయి. మంగళవారం నుంచి అక్కడ వర్షం కురుస్తోంది. ఒకవేళ వర్షం భారీగా కురిస్తే మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదు. అదే జరిగితే ముంబై జట్టుకు భారీ నష్టం తప్పదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version