
అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ లో ని బయోలాజికల్ పార్కులో దారుణం జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్ 35 ఏండ్ల వయసున్న జూ సిబ్బందిపై దాడి చేసి చంపేసింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో టైగర్ ఉన్న కేజ్ లోకి ప్రవేశించి వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో నే అతని పై పులి దాడి చేసింది. అయితే పులి ఉన్న బోను మూడు గేట్లు తెరిచి ఉండటంతోనే ఈ ఘటన జరిగినట్లు జూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సిబ్బంది మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు.