
చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. ఒక రోజు విరామం అనంతరం ధరలు పైకి కదిలాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 27 పైసలు, లీటర్ డీజిల్ పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.58 డీజిల్ రూ 83.51కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 99.14, డీజిల్ రూ.86.35 కుపెరిగింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 96.50, డీజిల్ రూ. 91.04 కు పెరిగింది. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు కంపెనీలు పదిసార్లు ధరలను పెంచాయి.