
తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. సింహంలాంటి వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా రేవంత్ నియామకంతో చాలా కాలం తర్వాత తనకి కాంగ్రెస్ పార్టీపై ఆసక్తి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆర్జీవీ తాజాగా ట్వీట్ చేశారు.