
కొంపల్లిలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి క్రీయాశీల పాత్ర పోషించారని తెలిపారు. రాజీవ్ రైతు దీక్ష పేరుతో నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన సభ విజయవంతం కావడం దిల్లీ కాంగ్రెస్ కు చేరింది. అందువల్లే నాకు టీపీసీసీ పదవి వచ్చింది. మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని తెరాస హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు. త్వరలో గజ్వేల్, నిజామాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.