
రాష్ట్రంలో పగటిపూట లాక్ డౌన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజలకు అన్ని రకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసుల్లో పాస్ పోర్ట్ సేవలను పునరుద్ధరించారు. నేటి నుంచి అవి ప్రారంభకానున్నాయి. లాక్ డౌన్ కారణంగా గత నెల 12న ఈ పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారికి లాక్ డౌన్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. అయితే లాక్ డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో సేవలు ప్రారంభిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సేవలు సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.