
కరోనా నేపథ్యంలో తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఆంక్షలు విధించారు. ఈరోజు నుంచి జిల్లాలోని కొడంగల్ మండలం రావులపల్లి, తాండూర్ మండలం కొత్లా పూర్ లవద్ద అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం పోలిసు, రెవెన్యూ, మైనింగ్, రవాణా, అటవీ శాఖల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ పౌసమిబసు కర్నాటక నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.