
కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తొలగించింది. డిజిటల్ కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో మోదీ ఫోటోను పంజాబ్ తీసివేసింది. గతంలో జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుంచి మోదీ చిత్రాన్ని తొలగించాయి. ఎవరి చిత్రాలు లేకుండా కేవలం తాము టీకా సర్టిఫికెట్లను మాత్రమే జారీ చేస్తున్నామని అధికారులు చెప్పారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొవిడ్ టీకాల కార్యక్రమానికి రూ. 1000 కోట్ల ను కేటాయించింది.