prabhas injured : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కి తీవ్రమైన గాయాలు అయ్యాయి అంటూ నిన్న సోషల్ మీడియా లో జరిగిన ఒక ప్రచారం, అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేశాయి. ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం అభిమానులు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ప్రభాస్ సన్నిహితవర్గాల నుండి వచ్చిన సమాచారం ఏమిటంటే, గాయపడిన విషయం వాస్తవమే కానీ,అభిమానులు భయపడేంత తీవ్రమైన గాయాలు మాత్రం కాదంటూ చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్దిరోజుల నుండి ప్రభాస్ ‘ఫౌజీ'(Fauji Movie) మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ హను రాఘవపూడి యుద్ధ సన్నివేశాలను ప్రభాస్ పై చిత్రీకరిస్తున్నారు. అందుకోసం ప్రభాస్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాడు. నిన్న షూటింగ్ లో ప్రభాస్ పై కొన్ని గుర్రపు స్వారీ షాట్స్ ని చిత్రీకరించారు.
ఈ సమయం లోనే ప్రభాస్ కి గాయాలు అయ్యాయి అని, షూటింగ్ ఆపేసి ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లగా, డాక్టర్లు పరిశీలించి, చిన్న గాయమే , ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపటి నుండి షూటింగ్ లో పాల్గొనచ్చు అని చెప్పారని సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ సన్నిహితులు చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త శాంతించారు. నేటి నుండి ఆయన షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇక ‘ఫౌజీ’ విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యిందని, కేవలం యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని, వీటి చిత్రీకరణ కోసం 100 రోజుల సమయం కావాలని అంటున్నారు. ప్రభాస్ కూడా నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ కి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా ఆయన ‘స్పిరిట్’ మూవీ ని పూర్తి చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన ‘ఫౌజీ’ కే ప్రాధాన్యత ఇచ్చాడు.
ఈ ఏడాది దసరా కి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితి లోనూ విడుదల చెయ్యాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. ఒకవేళ దసరా మిస్ అయితే డిసెంబర్ లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని పట్టుదలతో ఉన్నారట. మరి అది సాధ్యం అవుతుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు ఓవరాల్ షూటింగ్ 60 శాతం కి పైగా పూర్తి అయ్యింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తోంది. రజాకార్ సంగ్రామం సమయంలో ఒక పాకిస్తాన్ అమ్మాయి కి , ఇండియన్ ఆర్మీ కి చెందిన సైనికుడికి మధ్య జరిగిన ప్రేమ కథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. ఈ సందర్భంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.