
నారాయణపేట్ జిల్లా కేంద్ర దవాఖానలో నూతనంగా నెలకొల్పిన ఐసీయూ క్రిటికల్ వార్డును మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. 10 ఐసీయూ పడకల వార్డును వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు.