Homeక్రీడలుRavindra Jadeja Chennai Super Kings : చెన్నై కోసం ప్రాణం పెట్టాను.. ధోని ఫోన్...

Ravindra Jadeja Chennai Super Kings : చెన్నై కోసం ప్రాణం పెట్టాను.. ధోని ఫోన్ కలవలేదు.. జడేజా గుండెలో ఇంతటి ఆవేదన

Ravindra Jadeja Chennai Super Kings : 2026 ఐపిఎల్ ప్రారంభంలో చెన్నై, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది. ఆ విజయాన్ని రాజస్థాన్ ప్లేయర్లు ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. వారందరి కంటే ఎక్కువగా సంతోష పడింది రవీంద్ర జడేజా. వాస్తవానికి అతడు ఆ స్థాయిలో సంబరాలు జరుపుకుంటాడని.. ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడని చెన్నై అభిమానులు కలలో కూడా ఊహించలేదు.

ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ చెన్నై జట్టులో రవీంద్ర జడేజా కూడా అంతే స్థాయిలో ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి రవీంద్ర జడేజా 2026 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోతాడని.. అతడి స్థానంలో సంజు శాంసన్ వస్తాడని ఎవరూ ఊహించలేదు. కనీసం కలలో కూడా అంచనా వేయలేదు. రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టు తరుపున మెరుగైన ప్రదర్శన చేశాడు. దానికంటే ముందు చెన్నై జట్టు తరుపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అటువంటి రవీంద్ర జడేజాను మేనేజ్మెంట్ ఎందుకు పక్కన పెట్టింది అనేది ఇప్పటికి క్లారిటీ లేదు.

నాడు చెన్నై జట్టు తనను రాజస్థాన్ జట్టుకు పంపించే విషయం చివరి నిమిషం వరకు చెప్పలేదని రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్యలు కంట నీరు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే చెన్నై జట్టుతో అతడికి బలమైన సంబంధం ఉంది. ధోనితో సోదరుడి కంటే ఎక్కువ అనుబంధం ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ చెన్నై మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టడం.. రాజస్థాన్ జట్టుకు పంపించడం ఏమాత్రం అతడికి నచ్చలేదు. చివరి నిమిషంలో చెప్పడంతో.. మేనేజ్మెంట్తో మాట్లాడేందుకు అతడు ప్రయత్నించాడు. మేనేజ్మెంట్ వినిపించుకోలేదు. మహేంద్ర సింగ్ ధోనీకి చెప్పాలని ఫోన్ చేశాడు. అతడి ఫోన్ కలవలేదు. దీంతో బాధాకరమైన హృదయంతోనే అతడు రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోయాడు.

రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజుల వరకు జడేజా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే చెన్నై జట్టుతో అతడికి ఉన్న జ్ఞాపకాలు అటువంటివి. కొద్దిరోజుల వరకు మనసులో కలత ఉంది. ఆ తర్వాత క్రమక్రమంగా కుదుటపడ్డాడు. రాజస్థాన్ జట్టుకు ట్యూన్ అయ్యాడు. ఐపీఎల్ అనేది కమర్షియల్ గేమ్. ఇందులో సెంటిమెంట్లకు అవకాశం లేదు. బలమైన బంధాలకు ఆస్కారం లేదు. కానీ కొంతమంది ప్లేయర్లు దీనిని కమర్షియల్ గా చూడరు. ఆటలాగానే చూస్తారు. అనుబంధాలు పెంచుకుంటారు. వాటిని తుంచేస్తే ఇదిగో ఇలానే బాధపడుతుంటారు. అచ్చం రవీంద్ర జడేజాలాగా.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular