
కరోన కారణంగా ఎంతో మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న సెక్స్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సెక్స్ వర్కర్లు ఎదుర్కుంటున్న సమస్యలపై మహిళా సమన్వయ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సెక్స్ వర్కర్ లకు అందడం లేదని, వారిని ఎటువంటి గుర్తింపు పత్రలు అడగకుండానే వారికి రేషన్ ఇవ్వాలని సుప్రీమ్ కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.