
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్ లో కొవిడ్ కౌన్సిలింగ్ సెంటర్ ను పరిశీలించారు. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ స్వల్వంగా జ్వరం లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆస్పత్రుల్లో కొవిడ్ పరీక్ష చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసే మందులను వాడాలని సూచించారు. సీఎస్ తో పాటు జీహెచ్ ఎంసీ కమిషనర్, ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.