ramdhas-athavale
ఏపీ రాజధాని విషయంలో ఎన్నో రోజులుగా రైతులు ధర్నాలు చేస్తన్న సంగతి తెలిసిందే. రాజధాని విషయమై అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్నీ, తమ భాధను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే రైతుల డిమాండ్ న్యాయమైందని, పేదలు, దళిత రైతులు తమ భూములను రాజధాని కోసం త్యాగం చేసారని తెలిపారు. రాజధాని విషయంలో నా మద్దతు అమరావతికే ఉంటుందని, దీని గురించి ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాస్తానని అన్నారు.
Also Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల ఖాతాల్లో జమ..?